Ward Members | వార్డు మెంబర్లకు సన్మానం

Ward Members | వార్డు మెంబర్లకు సన్మానం
Ward Members | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : ఇటీవల జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో గెలిచిన వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, కాంగ్రెస్ నాయకులు పూల మాలలు, శాలువాలతో ఈ రోజు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ… గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుల పాత్ర కీలకమైందని, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చింత ప్రదీప్, కాలూరి మహేందర్, వేములవాడ జగదీష్, జైడి బాలకృష్ణ, శివాసారం లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, గణేష్, కిషన్, బుచ్చి మల్లయ్య, ప్రదీప్, అజ్మత్ పాషా, మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ నల్ల సాయికుమార్ గుప్తా, కౌడ శైలెందర్, రంజిత్, దీపక్, నాగరాజు, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
