కారు గుర్తు గెలుపుతోనే 20వ వార్డు అభివృద్ధి

క్యాతన్ పల్లి , ఆంధ్రప్రభ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గురువారం మంద వేణుగోపాల్ ఇంటింటా ప్రచారం చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన సేవలను గుర్తించి, నాకు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కంబగోని సుదర్శన్ గౌడ్, గోనె రాజేందర్, గాజుల చంద్రశేఖర్, ఆత్మకూరి మహేందర్, రవీందర్రావు, సొంత పూరి తిరుపతి, కేలోత్ బాలు, సబ్బని శ్రీనివాస్, మాదాసు శ్రీకాంత్, పడిదం రాయమల్లు, బండారి సతీష్, కందుగుల వామనమూర్తి , మహిళా నాయకురాలు నందెల్లి లలిత, రెడ్డమ్మ, మహిళ నాయకురాలు,నాయకులు ప్రజలు, టిఆర్ఎస్ అభిమానులు, మహిళలు, పాల్గొన్నారు.
