Warangal | హనుమకొండలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Warangal | హనుమకొండలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
  • వేడుకల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ డా.కావ్య

Warangal | వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : హన్మకొండలోని పరేడ్స్ గ్రౌండ్స్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య , శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply