Warangal | అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Warangal | అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
- పట్ట పగలు చోరీలు చేసే పశ్చిమ బెంగాల్ గ్యాంగ్
- 15 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
- 16లక్షల సొత్తు రికవరీ చేసిన సీసీఎస్, కేయు పోలీసులు
Warangal | వరంగల్ క్రైమ్, ఆంద్ర ప్రభ : పట్ట పగలు దొంగ తనాలు చేసే పశ్చిమ బెంగాల్ కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, కేయుసి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 16 లక్షల విలువ చేసే15 తులాల బంగారు నగలు, ఐదున్నర తులాల వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్టం ముర్షీదాబాద్ జిల్లా, బేలదంగా తాలూకా,ముజ్ పార గ్రామంకు చెందిన ఫెరోజ్ షేక్ (37), సుక్ చంద్(33), యామీన్ (36) ముగ్గురు దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు గ్యాంగ్ లో ప్రధాన నిందితుడైన ఫెరోజ్ షేక్ అనే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులైన ముగ్గురు త్రిమూర్తులు మద్యం, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. వారి జల్సాల కోసం సులువుగా డబ్బులు సంపాదించడానికి పట్ట పగలు తాళాలు వేసి ఉన్న ఇళ్ళను ఎంచుకొని తాళాలు పగలగొట్టి బంగారు, వెండి నగలు దొంగలించి వాటిని అమ్ముకొని జల్సాలు చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ష్టం, ముర్షీదాబాద్ జిల్లా బేలదంగా తాలూకా, ముజ్ పార గ్రామంకు చెందిన కేటుగాళ్ళు ఇప్పటి వరకు రాజస్థాన్, ఆంద్రా, ఒడిస్సా, మహారాష్ట్ర స్టేట్స్ లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘరానా దొంగల గ్యాంగ్ ను పశ్చిమ బెంగాల్, ఆంద్రా, మహారాస్ట్ర పోలీసులు గతంలో అరెస్టులు చేసి జైలుకు పంపించారు. కానీ నిందితులు తమ నేర ప్రవ్రత్తిని మార్చు కోలేదు. రెండు నెలల క్రితం నిందితులను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముజ్ పార పోలీసులు అరెస్ట్ చేయగా రెండు నెలల పాటు జైలు జీవితం గడిపి తిరిగి బయటకు వచ్చిన తర్వాత నిందితులు మళ్ళీ ముఠాగా ఏర్పడి తెలంగాణలో దొంగతనాలు చేయాలని పథకం వేసుకొన్నారు. వారి పథకం ప్రకారం నిందితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి హన్మకొండకు 2025 డిసెంబర్ 17 న హన్మకొండకు వచ్చారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏరియాలలో ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తర్వాత చోరీలకు తెగబడే వారు. ముగ్గురు దొంగల ముఠా ముందుగా పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీలలోని రెండు ఇళ్ళ తాళాలు పగలగొట్టి బంగారు, వెండి నగలతో పాటు నగదు మొత్తాలను దొంగలించుకుపోయారు. తరువాత మళ్ళీ డిసెంబర్ చివరలో హన్మకొండకు వచ్చి దొంగతనాలు చేయడానికి ప్రయత్నించారు. కానీ తిరిగి దొంగతనాలు చేసే అవకాశం దొరక్క తిరిగి వెళ్ళి పోయారు.
ఆ తర్వాత ఇంకోసారి 2026 జనవరి 10న,హన్మకొండకు వచ్చారు. మధ్యాహ్నం వేళ హన్మకొండ లోని గోపాలపురం, శివసాయి కాలనీలలో ఒక ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోని బీరువాలో గల సుమారు 15 తులాల బంగారు నగలు, 5 తులాల వెండి నగలు, కొంత నగదు దొంగిలించుకు పోయారు. వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా ఆగడాలకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డిసిపి దారా కవిత పర్యవేక్షణలో అడిషనల్ డిసిపి క్రైమ్ బాలస్వామీ, క్రైమ్ ఏసీపీ సదయ్య, హన్మకొండ ఇంచార్జి ఏసీపీ ప్రశాంత్ రెడ్డిల ఆధ్వర్యం లో స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో నేరస్థుల వివరాలను సేకరించి వారి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. సరిగ్గా అదే క్రమంలో నిందితులు మళ్ళీ దొంగతనాలు చేయడానికై కేయుసి జంక్షన్ దగ్గరకు వచ్చి ఉన్నారనే పక్క సమాచారం మేరకు కేయుసి,సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కేయుసి జంక్షన్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు.
నిందితులు పోలీసులను చూసి పారిపోతున్న క్రమంలో వారిని పట్టుకొని విచారించగా వారు చేసిన దొంగతనాల గురించి అంగీకరించారు.వారి నుండి సుమారు 15 తులాల బంగారు నగలను, 5 తులాల వెండి నగలను, నిందితులకు చెందిన సంబందించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సీసీఎస్ ఇన్స్ పెక్టర్ రామకృష్ణ, కేయుసి ఇన్స్ పెక్టర్ సుంకరి. రవి కుమార్, ఐటి కోర్ టీం ఏఏఓ మహ్మద్ సల్మాన్ పాషా, సీసీఎస్ ఎసైలు రాజ్ కుమార్, సాయి ప్రసన్న కుమార్, శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుల్స్ మహేశ్వర్, జంపయ్య, కానిస్టేబుల్స్ మధుకర్,చంద్రశేఖర్, రాములు, ఉపేందర్, వంశీ, విశ్వేశ్వర్, వినోద్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.
