పందుల సంచారం.. ఆరోగ్యానికి ముప్పు..

పందుల సంచారం.. ఆరోగ్యానికి ముప్పు..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో పందుల సంచారం రోజురోజుకూ పెరుగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రధాన వీధులు, కాలనీలు, పందులు గుంపులుగా తిరుగుతూ పరిసరాలను అపరిశుభ్రంగా మార్చుతున్నాయి. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా మారి, ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా నివాస ప్రాంతాలలో పందులు పెద్ద సంఖ్యలో చేరి, దుర్వాసన వ్యాపింపజేస్తున్నాయి. దీనివల్ల దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని పేర్కొంటున్నప్పటికీ అధికారులు సమస్య పై సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలో పలుమార్లు పందుల యజమానులకు సూచనలు చేసినప్పటికి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని వాపోతున్నారు. పందుల నియంత్రణ పై నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి అదుపు తప్పుతోందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్త నిర్వహణను కట్టుదిట్టం చేయడంతో పాటు పందుల సంచారాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ప్రజల ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply