పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూపు

మద్దూర్, ఆంధ్రప్రభ : పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.బిల్లులు పెండింగ్ ఉండడంతో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.
పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో అవస్థలుపడాల్సి వస్తోందని కొత్తపల్లి మండల ఎంపీడీఓ కృష్ణ రావు కు వినతిపత్రం అందజేశారు.వీటిని తక్షణమే మంజూరు చేయకపోతే బీఆర్‌ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ లకు మద్దతుగా కలెక్టర్ ముట్టడి చేస్తామని మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్నారు.
