Vuyyuru | భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి వీరమ్మ తల్లి

Vuyyuru | భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి వీరమ్మ తల్లి

మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బి.రాజేంద్రప్రసాద్

Vuyyuru | ఉయ్యూరు, ఆంధ్రప్రభ : భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి వీరమ్మ తల్లి అని మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరులో వేంచేసి ఉన్న శ్రీ పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్లు సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరులో అంగరంగ వైభవంగా వీరమ్మ తల్లి తిరునాళ్ళు 15 రోజులపాటు జరగడం మనందరం చేసుకున్న అదృష్టం అని, రాష్ట్రంలో మరి ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రోజులు తిరణాలు జరగవని, ఈరోజు అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మాజీ సర్పంచ్ భ్రమరాంబ మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు, ఉయ్యూరు పట్టణం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో కుచేలుడు, శేషగిరి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply