vrushakarma | తృటిలో తప్పిన ప్రమాదం

vrushakarma | తృటిలో తప్పిన ప్రమాదం
‘వృషకర్మ’ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ కార్యక్రమంలో….
vrushakarma | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ‘వృషకర్మ’ (vrushakarma) చిత్ర ఫస్ట్ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కు తృటిలో ప్రమాదం తప్పింది. స్టేజీపై కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా పట్టుతప్పి వెనక్కి పడిపోవడంతో చైతన్య కిందపడే స్థితికి చేరుకున్నాడు. అయితే పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మెరుపు వేగంతో స్పందించి ఆయన్ని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఊహించని ఘటనతో హాల్‌లోని అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. కానీ చైతన్య ఏమీ కాలేదని చిరునవ్వుతో సైగ చేస్తూ అందరినీ శాంతింపజేశాడు. అసౌకర్యాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రసంగాన్ని సాగిస్తూ అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు (fans) చైతన్య ధైర్యాన్ని, కూల్‌గా స్పందించిన తీరును కొనియాడుతున్నారు.
