VOTERS | ప్రజాసేవకు జీవితం అంకితం చేస్తా…

VOTERS | ప్రజాసేవకు జీవితం అంకితం చేస్తా…

వేల్లంపల్లి సర్పంచ్ అభ్యర్థి కూర వెంకటరాజిరెడ్డి

VOTERS | టేకుమట్ల, ఆంధ్రప్రభ : తనకు ప్రజాసేవ చేసే అవకాశమిస్తే.. తన రాజకీయ జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కూర వెంకటరాజిరెడ్డి ఓటర్లకు విన్నవించారు. ఇవాళ‌ ఆయన గ్రామంలో గడపగడపకు ప్రచారం నిర్వహిస్తూ ఓటు వేసే విధానాన్ని స్వస్తిక్ చిహ్నం ద్వారా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, తమను గెలిపిస్తే ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎన్నో సమస్యలున్నాయన్నారు. గ్రామంలో వైద్య సేవలు అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. లాభదాయక వ్యవసాయం జరిగే విధంగా ఉద్యాన పంటల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పారు.

ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. కాగా మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

Leave a Reply