voters | మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సునీల్ విస్తృత ప్రచారం

voters | మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సునీల్ విస్తృత ప్రచారం
voters | పరకాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ పరకాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ రోజు పరకాల పురపాలక సంఘం 7వ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ పరకాల పట్టణ ప్రజలకు సుపరిచితులు. ప్రచారంలో ఏ వీధికి వెళ్ళిన ఓటర్లను బంధుత్వంతో పలకరించడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ… మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనతోపాటు కాంగ్రెస్ పార్టీ వివిధ వార్డుల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
