ఓటరు చైతన్య కార్యక్రమాలు..
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓ వైపు ప్రచారంలో మునిగితేలుతున్న వేళ… మరో వైపు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేలా SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) క్రింద ఓటరు చైతన్య, అవగాహన కార్యక్రమాలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. కాలనీలలో “నా ఓటు నా హక్కు, నా శక్తి.. నేను తప్పక ఓటు వేస్తా ” నినాదాలు మారుమ్రోగుతున్నాయి.
ఉప ఎన్నికలో తమ ఓటును తప్పకుండా వినియోగించుకుంటాం అంటూ తేల్చి చెబుతున్నారు. జూబ్లీహిల్స్ కాలనీల ప్రజలు.. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తు చేస్తూ యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్‌లో 11.11.2025 పోలింగ్ తేదీతో కూడిన భారీ అవగాహన బెలూన్ ను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రదర్శించిన ఈ బెలూన్ ఓటు చైతన్యానికి ప్రతీకగా నిలిచింది.

