కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : కారు గుర్తుకు ఓటు వేసి విజయం అందించాలని ఒకటో వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శెవ్వ అశోక్ కోరారు. శుక్రవారం వార్డు లో మహిళలు, యువకులు, అనుచరులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్తించారు. కాలనీ ప్రజలకు నిజాయితీ తో కూడిన అందుబాటులో ఉండి సేవ చేస్తానని అవకాశం ఇచ్చి విజయం అందించాలని వేడుకున్నారు. మీలో ఒకడిగా మీ సమస్యలే నా సమస్యలు గా పోరాటం చేస్తానని పేర్కొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారం తో వార్డులోని అన్ని గల్లీలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు అందరికి అందుబాటులో ఉండి సేవ చేయడం కొరకు కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

Leave a Reply