కారు గుర్తుకు ఓటు వేయండి

- కాంగ్రెస్ ఆరాచక పాలనను అంతం చేద్దాం ..
జూబ్లీహిల్స్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్, నటరాజ్ నగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ తో కలిసి జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి అయేషా, కార్పొరేటర్లు సామల హేమ, ప్రసన్న లక్ష్మీ, లత, GHMC కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా “ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించింది. రాష్ట్రాన్ని ఆరాచక పాలనలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీత గోపినాథ్ ని ఘన విజయంతో గెలిపించాలి” అని పిలుపునిచ్చారు.



