బ్యాట్ గుర్తుకు ఓటెయ్యండి…

  • సేవ చేసేందుకు అవకాశం కల్పించండి

మంథని, ఆంధ్రప్రభ : బ్యాట్ గుర్తుకు ఓటు వేసి, మీ సేవ చేసేందుకు అవకాశం కల్పించండి అని సర్పంచ్ అభ్యర్థి బొడ్డు శారద మహేందర్ ప్రజలను కోరుతున్నారు. ఆదివారం మంథని మండలం ఎక్లాస్‌పూర్ గ్రామంలో ఆమె ప్రచారం వేగం పెంచారు. ప్రచారానికి జడ్పీటీసీ సభ్యురాలు తగరం సుమలత శంకర్‌లాల్ సైతం తోడయ్యారు.

ప్రజలే శారద తరఫున ప్రచార బాట పట్టడం విశేషం. సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గ్రామంలో ప్రతి వాడవాడికి సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా పనిచేస్తానని స్పష్టం చేశారు.

బ్యాట్ గుర్తుకు ఓటేసి అవకాశం ఇస్తే బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలను కంటి కెప్పలా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.

ఆమె ప్రచారంలో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టడం ప్రత్యేకంగా నిలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బొడ్డు శారద మహేందర్ గెలుపు ఖాయమని గ్రామస్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం అందజేస్తానని ఆమె తెలిపారు. ఒకసారి ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే ఎక్లాస్‌పూర్ గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply