Vote | భద్రాచలంలో ఓటు కోల్పోయిన మహిళా
- టెండర్ ఓటు కేటాయించిన అధికార్లు
Vote | భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలం పట్టణంలో ఓ మహిళ తన ఓటు వేయటానికి వెళ్ళగా అప్పటికే వేరే వారు ఓటు వేయడంతో ఆ మహిళ దిగ్బ్రాంతి గురైంది. వివరాల్లోకెళ్తే.. నాలుగో వార్డుకు చెందిన లక్ష్మీ అనే మహిళ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్థానిక పోలింగ్ కేంద్రానికి వెళ్ళింది. అక్కడ ఉన్న సిబ్బంది ఆమె ఓటు హక్కు వినియోగించుకుందని తెలుపగా, అక్కడ చేసిన సంతకం తనది కాదు అని చెప్పినప్పటికీ సిబ్బంది ఆమెను ఓటు వేసేందుకు అంగీకరించలేదు. దిగ్భ్రాంతి గురైన మహిళ అక్కడ ఉన్న ఏఎస్పీ, తాసిల్దార్ లకు తన విషయం తెలుపగా ఆ మహిళకు టెండర్ ఓటు కేటాయించారు. ఎన్నికల కమిషన్ ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఓటర్ తన వివరాలు పూర్తిస్థాయిలో అధికారులకు అన్ని ఆధారాలతో చూపించినప్పుడు, అక్కడ ఉన్న ఎన్నికల అధికారి ఆయా వ్యక్తుల ఏజెంట్లతో మాట్లాడి ఒక ప్రత్యేక కవర్లో దానిని ఉంచుతారని… రికౌంటింగ్ వంటి ప్రత్యేక పరిస్థితులలో ఈ ఓటు లెక్కకు తీసువడం జరుగుతుందని తెలిపారు.

