స్వచ్ఛందంగా పోలీసు సేవలు..

స్వచ్ఛందంగా పోలీసు సేవలు..
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఫిర్యాదు సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్ హెచ్ ఓలకు ఫోన్ ద్వారా ఎస్పీ పరితోష్ పంకజ్(Paritosh Pankaj) సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే(Grievance Day) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, ఫిర్యాదు సమస్యను విని, సమస్య జాప్యానికి గల కారణాల గురించి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తెలుసుకున్నారు.
చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేసినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలకు స్థానిక పోలీస్ స్టేషన్(Police Station)లో పరిష్కారం దొరకనప్పుడు ఎలాంటి పైరవీలకు తావు లేకుండా, స్వచ్ఛందంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ(reviewing).., ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.
