Vivekananda | స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు

Vivekananda | స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు

Vivekananda | నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద(Vivekananda) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వక్తలు మాట్లాడుతూ… స్వామి వివేకానంద గారి ఆశయాలను ఆచరణలో పెట్టుకొని దేశాభ్యున్నతికి యువత ముందుకు రావాలని, క్రమశిక్షణతో పాటు సేవాభావంతో పనిచేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, సమాజ నిర్మాణం(structure of society)లో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కండకార్యవాహ్ కొన్యాల సోమరాజు, శిశు మందిర్ ప్రధాన ఉపాధ్యాయులు బాబా, యువజన సంఘాల నాయకులు పోచయ్య, అమర్, సతీష్, రమేష్, మల్లేశం, రాజు, నరేష్, సత్యపాల్ రెడ్డి, దాసు, బాలరాజు, సాయిరా, సంతోష్, శ్రీనివాస్, బిక్షపతి, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply