Viveka Murder : కట్టప్ప శంకరయ్య

Viveka Murder : కట్టప్ప శంకరయ్య
- అండర్ కవర్డ్ ఆఫీసర్ పై నేడో రేపో కేసు
- కేసు దర్యాపులో Hindrance
- క్రైమ్ సీన్ తారుమారు బ్రహ్మ
- సీబీఐకీ చుక్కలు చూపిన ఐవో
- ఇక కూటమి సర్కారు గురి
- తప్పదు తకిట తకిట తాండవం
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
పులివెందుల ప్రేమ బిడ్డ. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ అలా..ఇలా.. పిటీషన్ల మధ్య పిటీషన్ల ఘోషలో.. ఆగి ఆగి ముందుకు సాగుతున్న తరుణంలో… వివేకానంద మర్డర్ కేసు (Vivekananda Murder) దర్యాప్తునకు ప్రధాన విఘ్నేశ్వరుడిగా (Hindrance) పేరు తెచ్చుకున్న.. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ శంకరయ్య కూడా కటకటాలు లెక్క పెట్టాల్సిందేనా? ఔను.. ఓ ప్రధాన హత్య కేసులో ఆధారాలను తారుమారు (Manipulation of evidence) చేయటం.. దర్యాప్తును పక్క దోవ పట్టించినందుకు తగిన మూల్యం తప్పదు.
ఈ కేసులో శంకరయ్య (Sankaraiah) తప్పటడుగుల తాండవం శృతి మించింది. కేసులో ప్రధాన నిందితుల ప్రయోజనమే లక్ష్యంగా పని చేశారని పోలీసు శాఖ తేల్చి చెప్పింది. అందుకే ఉద్యోగం ఊడగొట్టింది. ఇక ఈ హత్య కేసులో కుట్రదారుడిగా (Conspirator) శంకరయ్య పై పోలీసు శాఖ కేసు నమోదు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంతే కాదు.. ముందస్తు బెయిల్ కోసం శంకరయ్య తరపున ప్రయత్నాలు ప్రారంభమైనట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Viveka Murder : పులివెందుల కెవ్వుకేక
అది పులివెందుల. వైఎస్ వివేకానంద రెడ్డి భవనం. 2019 మార్చి 15న, ఉదయం 5:30 నుంచి – 6:15 గంటల మధ్య పర్సనల్ అసిస్టెంట్ ( Personal Assistant) ఎమ్.వి. కృష్ణ రెడ్డి (MV Krishna Reddy) వంట మనిషి యెడ్డుల లక్ష్మి (Yedula Lakshmi) కాపలాదారుడు రంగన్న వివేకానంద రెడ్డి మృతదేహాన్ని చూశారు. 6:15 గంటలకు కుటుంబ సభ్యులు వివేకానంద భార్య సౌభాగ్య, కుమార్తె సునీతకు కృష్ణ రెడ్డి తెలిపారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి కూడా సమాచారం చేరింది. 6:26 నుంచి – 6:44 గంటల మధ్య అవినాష్ రెడ్డికి నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి (Narreddy Siva Prakeash Reddy) ఫోన్ చేసి తెలిపారు. హార్ట్ అటాక్ అని అవినాష్ రెడ్డి FIR నమోదు చేయించాడు.
Viveka Murder : కట్టప్ప ఎంట్రీ
7:02 నుంచి – 7:03 గంటలకు పులివెందుల సీఐ శంకరయ్య (J. Shankaraiah) నేరస్థలికి చేరుకున్నారు. 10:30 గంటలకు ( DSP Naga Raju) నాగరాజు ఈ కేసును తీసుకున్నారు. హత్యకేసుగా నిర్ధారించారు. అంటే.. మూడున్నర గంటల పాటు నేర స్థలిలోనే సీఐ శంకరయ్య చక్రం తిప్పారని అనుమానాలు పెరిగాయి.
Viveka Murder : నోకేస్ .. నో పోప్టుమార్టం
ఎందుకంటే.. ఉదయం ఏడు గంటలకు దర్యాప్తు అధికారిగా శంకరయ్య తొలిసారిగా నేర స్థలికి వెళ్లారు. క్రైమ్ సీన్ (Crime Scene) పరిశీలించారు. హార్ట్ అటాక్ (Heart Attack) గా ప్రకటించాలని ఒత్తిడి వచ్చిన స్థితిలో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించలేదు. క్రైమ్ సీన్ ప్రతి ఆధారాన్ని చెక్కుచెదరకుండా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కట్టడి చేయాలి. ప్రతి ఆధారాన్ని సేకరించాలి. క్లూస్ టీమ్ (Clues Team) వచ్చే వరకూ.. నేరస్థలిలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకూడదు. కనీసం పోలీసులు కూడా మృతదేహం దగ్గరకు వెళ్లకూడదు. పాద ముద్రలు, (Foot Prints) వేలి ముద్రలు.. హంతకుల వెంట్రకలు ( Hair Samples) .. ఇలా ప్రతి ఆధారాన్ని రక్షించాలి. కానీ 10.00 గంటలకు క్రైమ్ సీన్ మారిన తరువాత డీఎస్సీ నాగరాజుకు సమాచారం ఇవ్వటంతో.. ఆయన చేరుకుని హత్యగా నిర్ధారించారు.
Viveka Murder : అండర్ కవర్డ్ ఆఫీసర్
ఔను , 1995 బ్యాచ్ . సీఐ శంకరయ్యపై ఆరేళ్లుగా అండర్ కవర్డ్ (Under Covered Officer) ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రధానంగా వివేకానంద హత్య కేసులో ఆధారాల తారుమారు , హత్యా స్థలంలో రక్తపు మరకలు, గాయాల ఆధారాలను మాయం చేశారని ఆరోపణ. నేర స్థలిలో మృతదేహం చుట్టూ ఆధారాలను అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మార్చుతుంటే శంకరయ్య వారించలేదు.
Viveka Murder : వాళ్లకి బెయిలొస్తే చాలు..
ఇది రాజకీయ ఒత్తిడి (Political Pressure) కారణంగా జరిగినట్టు సీబీఐ అనుమానించింది. ఇక హత్య కేసుగా నమోదు చేయకుండా, సహజ మరణం గా చూపించేందుకు ప్రయత్నించారు. శవాన్ని పోస్ట్ మార్టానికి ( Post mortem) తరలించకుండా జాప్యం చేశారని, గాయాలరు దాచారని ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఇక సాక్షుల వాంగ్మూలం మార్చటానికి ప్రయత్నించారని , CBI అధికారులపై కూడా శంకరయ్య ఆరోపణలు చేశారు. కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగి రెడ్డి ఒత్తిడి తెచ్చారని అప్పటి సీఐ శంకరయ్యపై తన వాంగ్మూలంలో చెప్పారు. తర్వాత రివర్స్ అవడంతో “నిందితుల ప్రభావం” అని CBI కోర్టుకు తెలిపింది. ఇక చార్జ్‌షీట్ ఆలస్యం చేసి నిందితులకు బెయిల్ లభించడంలో సీఐ శంకరయ్య కీలక పాత్ర పోషించారని TDP అధినేత చంద్రబాబు , BJP నేత ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. శంకరయ్యను కవరప్ ఆఫీసర్ గా అభివర్ణించారు.
Viveka Murder : సీబీఐ చార్జ్‌షీట్ కథనం..
2021 అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో సీబీఐ తొలి చార్జ్‌షీటు సమర్పించింది. A1 ఎర్ర గంగి రెడ్డి, A2 సునీల్ యాదవ్, A8 గా అవినాష్ రెడ్డిని సీబీఐ పేర్కొంది. ఇక శంకరయ్యను సాక్షి గా (- Prosecution Witness) ప్రకటించింది. కేసు నమోదు చేయవద్దు, పోస్ట్‌మాన్టం వద్దు, గాయాలు దాయాలని అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఒత్తిడి చేశారని 2020 జులై న తన తొలి వాంగ్మూలంలో శంకరయ్య చెప్పారు. హత్య గురించి రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయని భయం వ్యక్తం చేశారని ఈ వాంగ్మూలంలో శంకరయ్య చెప్పారు. CrPC 164 ప్రకారం సాక్ష్యం ఇవ్వలేదు. పైగా CBIపై ఆరోపణలు చేశారని . చార్జ్‌షీటులో సీబిఐ పేర్కొంది.
Viveka Murder : అతడే హిడరెన్స్ .. సీబీఐ
2023 జూన్ 31న సీబీఐ సప్లిమెంటరీ చార్జ్‌షీటులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వై.ఎస్. భాస్కర్ రెడ్డిని చేర్చింది. శంకరయ్యపై ఆరోపణలు మరింత బలపడ్డాయి. 290 మందిని సీబీఐ విచారించింది. మొత్తం 24 మంది సాక్షుల్లో ఆరుగురు కీలక సాక్షులు మృతి చెందారు. CBI తన నివేదికలో శంకరయ్యను హిందరెన్స్ ప్రకటించింది. ప్రస్తుతం వివేకానంద మర్డర్ – కేసు సీబీఐ స్పెషల్ కోర్టు (హైదరాబాద్ )లో విచారణలో ఉంది. అప్రూవర్ షేక్ దస్తగిరి క్రాస్-ఎగ్జామినేషన్ కొనసాగుతోంది.
Viveka Murder : అబ్బాయ్ పైనా అనుమానాలు
హత్యకు ముందు, తర్వాత అవినాష్ రెడ్డి వాట్సాప్ చాట్‌లు, కాల్ రికార్డులను సీబీఐ పరిశీలించింది. వివేకానంద హత్య సమాచారం ప్రజలకు తెలియ ముందే జగన్ కు చేరింది. ఈ కుట్రలో జగన్ పాత్రను కూడా సీబీఐ అనుమానించింది. హత్య జరిగిన సమయంలో జగన్ YSRCP అధ్యక్షుడిగా (2019) ఉన్నారు. వివేకా మరణం సెంటిమెంటల్ వేవ్ తో జగన్ కు పెద్ద మైలేజీ దక్కింది. జగన్ సీఎం అయ్యారు. అంతే వివేకానంద మర్డర్ ను టీడీపీ, జనసేన వంటి పార్టీలు దీన్ని ప్రయోజనకరహత్యగా (Beeficial Homicide) పిలుస్తున్నాయి.
తొలుత జగన్ సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. కానీ, SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) రంగంలోకి దించారు. 2024 ఎన్నికల తర్వాత కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. కానీ 6 సంవత్సరాల తర్వాత కూడా పూర్తి ప్రోగ్రెస్ లేదు. ఈ స్థితిలో హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు నుంచి మరో కోర్టుకు విచారణ బదిలీ చేయాలని డిమాండ్ తెరమీదకు రాగా.. వివేక మర్డర్ కేసు (Vivekananda Murder Case) విచారణను 2022లో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
2025 సెప్టెంబర్ 16న సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. చార్జ్‌షీట్ దాఖలైంది, మీరు ట్రయల్ కోర్టును సంప్రదించండి అని సూచించారు. సీబీఐ దర్యాప్తు పూర్తి కాగ. మీరు బస్ మిస్ అయ్యారు” అని వ్యాఖ్యానించింది. ఎనీ హౌ.. వివేకానంద హత్య కేసులో ప్రాథమిక ఆధారాల తారుమారు వ్యవహారంలో కవర్డ్ ఆఫీసర్ గా పేరొందిన శంకరయ్యకు.. కేసుల తిప్పలు తప్పవని జనం చర్చించుకొంటున్నారు.
