Visiting | మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు

Visiting | మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు
Visiting | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ అభినవ శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఆలయ వ్యవస్థాపకులు చక్రవర్తుల పురుషోత్తమచార్యులు ఘన స్వాగతం పలికారు. అయ్యప్పస్వామి ఆలయ సముదాయంలో అయ్యప్ప భక్తుల మండల పూజలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గురు స్వామి చక్రవర్తుల పురుషోత్తమచార్యులు మంత్రి లక్ష్మణ్ ను శాలువాతో సత్కరించారు.
