హైదరాబాద్ : బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం వ్యవహారంలో బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె.. విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి.
ఇమ్రాన్‌ఖాన్, హర్షసాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, సందీప్‌లపై బీఎన్‌ఎస్ 318(4) 3, 3ఏ, టీఎస్‌జీఏ, 66డీఐటీఏ-2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యంలో విచారణకు రావాలంటూ విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.