ఆంధ్రప్రభ, ఇంద్రవెల్లి : తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ (Visharadhan Maharaj) చేపట్టిన రాష్ట్రవ్యాప్తంగా లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి చేరుకుంది. ఇంద్రవెల్లి (Indravelli) అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అక్కడ నుండి ఇంద్రవెల్లి అంబేద్కర్ చౌరస్తా వరకు కాలినడకన పాదయాత్రగా వెళ్లారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీసి ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం దిశగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేపట్టి అట్టడుగు వర్గాల ప్రజలకు వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రథయాత్రను చేపట్టడం జరిగిందన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు 2000 సంవత్సరాల నుండి అణచివేయబడుతున్నారని, రాజ్యాధికారం దిశగానే అడుగులు వేసేందుకు ధర్మ సమాజ్ పార్టీ (Dharma Samaj Party) బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో చైతన్యం తేవడం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని, ఆనాడు ఇంద్రవెల్లి ఘటన జరగడానికి కారనమైనవారే నేడు పాలకులయ్యారని, అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ తమ స్వరాజ్యం సాధించే దిశగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నేల లక్ష్మణ్, డి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్, బిఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి పెందుర్ అంకుశ్, సీనియర్ నాయకులు ఉత్తం కాంబ్లే, తుడుం దెబ్బ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కనక గణేష్, ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా కన్వీనర్ సొన్ కాంబ్లే బాబాసాహెబ్, భీమ్ ఆర్మీ నాయకులు పరత్వాగ్ దత్త, డీఎస్పీ ఉట్నూర్ మండల అధ్యకులు అరవింద్, కన్వీనర్ హరిప్రసాద్, ఇంద్రవెల్లి యూత్ ప్రెసిడెంట్ సుమిత్ తిట్టే, బిజెపి మాజీ మండల అధ్యక్షుడు ఆరెల్లి రాజలింగు, SSD నాయకులు విక్రమ్, వాగ్మారే ఆకాష్, మేఘా యూత్ సభ్యులు తుంగపిండి నితేశ్, ఉప్పరి పవన్ కుమార్, ఎల్తూరి చంద్రకాంత్, కత్తి నయన్ తదితరులు పాల్గొన్నారు.
