ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : అమెరికా అధ్య‌క్షుడి (American President)గా బాధ్య‌త‌లు తీసుకున్న ట్రంప్ (Trump) షాకుల మీద షాక్ ఇస్తున్నాడు. త‌న వింత ధోర‌ణితో ప్ర‌పంచ దేశాల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాడు. అధిక సుంకాల‌ను (tariffs) విధిస్తూ అన్ని దేశాల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాడు. తాజాగా విద్యార్థుల‌కు (students) కూడా షాక్ ఇవ్వ‌బోతున్నాడు. అమెరికా(America)లో చదువుకుంటున్న, ఉన్నత చదువుల కోసం ఆ దేశానికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వీసా(visa)లపై పలు ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా.. తాజాగా మరో కీలక సవరణకు ప్రతిపాదనలు చేసింది. విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఎక్కువ కాలం ఉండిపోకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు (exchange visitors), మీడియా ప్రతినిధులకు (media representatives) జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా నిబంధనలకు సవరణ చేయనుంది.

ట్రంప్ విధించ‌బోయే ఆంక్ష‌లు ఇవే..
ఎఫ్‌, జే వీసా హోల్డర్లు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లకు గరిష్ఠ కాల పరిమితి నాలుగేళ్లు. గ్రాడ్యుయేట్ (graduates) స్థాయి ఎఫ్‌-1 విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రామ్‌లు మార్చుకుంటే ఆంక్షలు తప్పవు. ఎఫ్‌-1 విద్యార్థులు మరో వీసా కోసం ప్రయత్నించేందుకు ప్రస్తుతం ఉన్న గ్రేస్‌ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదింపు. ఐ-వీసాదారులు (మీడియా ప్రతినిధులు) 240 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత వీసా పరిమితిని మరో 240 రోజులకు పొడిగించుకోవచ్చు. చైనా మీడియా ప్రతినిధులకు అదనపు ఆంక్షలు.

Leave a Reply