Visakha | న్యూడ్ వీడియోల షూటింగ్ … నిందితుల‌ను చిత‌క్కొట్టిన యువ‌తులు

విశాఖ‌ప‌ట్నం – విశాఖలో (visakha) యువతుల న్యూడ్ వీడియోస్ (nude video ) రికార్డింగ్ (recording ) ఘటన కలకలం రేపుతోంది. లాడ్జిలో దిగిన యువతుల న్యూడ్ వీడియోలని చిత్రీకరించారనే ఆరోపణలతో నలుగురు యువకులను యువతులు చితకబాదారు. ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు (case ) నమోదు (filed ) చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే విశాఖలోని ద్వారకలో బాయ్స్ హాస్టల్, లాడ్జి పక్కపక్కనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బాయ్స్ హస్టల్ నుంచి లాడ్జి బాత్రూంలో స్నానాలు చేస్తుండగా కి ఫోన్‌లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపణలు చేశారు. నాలుగు రోజులు నుంచి తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారు అంటూ నలుగురు యువకులను యువతులు చితకబాదారు. దేహశుద్ధి అనంతరం ద్వారక పోలీసులకి యువకులను అప్పగించారు. ద్వారక పోలీసులు యువకులు సెల్ ఫోన్లు పరిశీలించి వీడియో రికార్డింగ్ వాస్త‌వ‌మ‌ని తేల్చారు… యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply