kohli |అత‌నిలాంటోడిని చూడ‌లే..

kohli |అత‌నిలాంటోడిని చూడ‌లే..

తన ఉనికితో శక్తిని నింపుతాడు
అత్యుత్తమ వర్క్ ఎథిక్ కోహ్లీదే..
ఆర్‌సీబీ గుండెచప్పు విరాట్ కోహ్లీ

kohli | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. నేను నా జీవితంలో చూసిన అత్యుత్తమ వర్క్ ఎథిక్ కోహ్లీదే. అతను టోర్నమెంట్‌లోకి ఎప్పుడూ పూర్తి సన్నద్ధతతో వస్తాడు. ఒకవేళ అతను రాణించకపోతే అది కేవలం ఫామ్ సమస్య లేదా టెక్నికల్ లోపం వల్లనే అవుతుంది తప్ప, ప్రాక్టీస్ లేక కాదు. విరాట్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈసారి కూడా ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్ నెగ్గే అవకాశం ఉంది.’అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు. ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ ఆటగాడు మాత్రమే కాదని, ఆ ఫ్రాంచైజీ గుండెచప్పుడని తెలిపాడు.

kohli | విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌తో కాకుండా తన ఉనికితో జట్టులో శక్తిని నింపుతాడని, ఆట కోసం అతని చూపే క్రమశిక్షణ అద్బుతమని కొనియాడాడు. కోహ్లీ మైదానంలో చూపించే ఉత్సాహం, గెలుపు కోసం పడే తపన యువ ఆటగాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తుందన్నాడు. గతంలో ఆర్‌సీబీ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడేదని, కానీ గత సీజన్‌లో జట్టు మొత్తం సమష్టిగా రాణించి విజేతగా నిలిచిందన్నాడు. విరాట్ కోహ్లీ(657) టాప్ రన్ స్కోరర్‌లలో ఒకడిగా నిలవడమే కాకుండా.. రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, రోమారియో షెపర్డ్ వంటి వారు అద్భుత ప్రదర్శన చేశారు. బంతితో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు.

Leave a Reply