టీమిండియా మరోసారి ఆస్ట్రేలియాతో తలపడేందుకు సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం జట్టు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన మైదానంలో రీఎంట్రీ కోసం కఠిన సాధనలో మునిగిపోయాడు.

ఇప్ప‌టికే టీ20, టెస్టుల‌కు విరాట్ గుడ్ బై చెప్పేశాడు. ఇక త్వ‌ర‌లోనే వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇవ్వనున్నారన్న ఊహాగానాల మధ్య, అభిమానులు మళ్లీ విరాట్‌ను మైదానంలో చూడబోతున్నారన్న ఆనందంలో ఉన్నారు. తాజాగా, లార్డ్స్‌లోని ఇండోర్ నెట్స్‌లో కోహ్లీ సుమారు రెండు గంటలపాటు బ్యాటింగ్ సాధన చేశాడు. స్పిన్, ఫాస్ట్ బౌలర్ల బంతులను ఎదుర్కొంటూ చెమటోడ్చాడు.

కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా టీ20, టెస్ట్ క్రికెట్‌కి వీడ్కోలు పలికారు. అయినా అభిమానులు ఈ ఇద్దరూ కనీసం 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు జట్టులో కొనసాగాలని కోరుకుంటున్నారు. దీర్ఘ విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్న విరాట్‌ను చూడటానికి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply