గమ్యానికి చేరిన గ్రామస్తులు…
వెల్దండ, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి నీటి ప్రవాహం రోడ్డుపైకి చేరడంతో ప్రయాణికులు, రైతులు(Travelers and farmers), తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెల్దండ మండల సమీపంలోని రాచూర్ గ్రామంలో ఈ రోజు కురిసిన భారీ వర్షాల కారణంగా మండల కేంద్రమైన వెల్దండ నుండి రాచూర్ కి వెళ్లే ప్రధాన రహదారిపై ఊర గండికుంట ఉప్పొంగి ఉదృతంగా ప్రవహించడంతో ప్రయాణికులకు, రైతులకు తీవ్ర అంతరాయం కలిగింది.
రాచూర్, కల్వకుర్తి(Rachur, Kalvakurthi)కి వెళ్లే ప్రధాన రహదారిపై అప్పయ్య కుంట సమీపంలో వరద ప్రవహించడంతో ప్రయాణికులు, రైతులు ఎక్కడి కక్కడే స్తంభించి పోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు, జేసీబీ(JCB) సహాయంతో ప్రయాణికులను, రైతులను సురక్షితంగా దరికి చేర్చారు. ఇకనైనా అధికారులు స్పందించి మండలానికి వెళ్లే ప్రధాన రహదారిని త్వరలో నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

