KNR | వాగులో చిక్కుకున్న మహిళా కూలీలను కాపాడిన గ్రామస్తులు..

కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, ఆంధ్రప్రభ : పొలం పనులు ముగించుకుని తిరిగి వస్తున్న మహిళా కూలీలు వాగులో నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామ శివారులో నక్కల ఒర్రె పొంగి ప్రవహించడంతో ఈ ప్రమాదం జరిగింది.

గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన మహిళా కూలీలు మల్యాలలో వరి నాట్లు వేసేందుకు వచ్చారు. సాయంత్రం పనులు ముగించుకుని పోచంపల్లికి తిరిగి వెళ్లే క్రమంలో నక్కల ఒర్రె దాటే ప్రయత్నంలో వాగులో చిక్కుకుపోయారు. నీటి ఉద్ధృతికి అసహాయంగా అరవుతూ సహాయం కోరిన మహిళలను చూసిన స్థానిక రైతులు అప్రమత్తమయ్యారు. వెంటనే తాళ్లు తీసుకువచ్చి నీటిలోకి విసిరి మహిళలను సురక్షితంగా బయటకు తీసారు. గ్రామస్తుల స్పందన, సహృదయత మరోసారి మానవత్వాన్ని చాటిచెప్పిందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply