గ్రామ సభలో భాగస్వాములైన జుక్కల్ మండల గ్రామస్తులు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జుక్కల్ మండల కేంద్రంతో పాటు మరో 29 గ్రామపంచాయతీలలో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చురుకుగా భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ మారుతి, ఉప తహసీల్దార్ హేమలత, ఎంపీడీఓ బి. శ్రీనివాస్, ఎంపీఓ రాము, జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులు, మండల మరియు గ్రామస్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గ్రామసభల్లో ప్రభుత్వ పథకాల అమలు, గ్రామ మరియు వార్డుల అభివృద్ధి పనుల ప్రణాళిక, పారదర్శకత వంటి ముఖ్యాంశాలపై చర్చించి అజెండాను రూపొందించారు.
నాగల్‌గాం గ్రామపంచాయతీలో సర్పంచ్ సునంద విజయ్ (బాబు) పటేల్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అర్హులందరికీ చేరిక, పచ్చదనం–పరిశుభ్రత, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై చర్చించారు.
