ఆనందంలో.. గ్రామస్థులు..

  • మార్కండేయ గుడి లైటింగ్ ఖర్చు ఎంత..?

ఎండపల్లి, (ఆంధ్రప్రభ) : ఎండపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి వారి ఆలయం వద్ద సుమారు రూ: 200000 వ్యయంతో హైమస్ లైట్స్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లైట్స్ ఏర్పాటు చేయడంలో సహకారం అందించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాజీ వెల్గటూర్ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ బషీర్, మాజీ జడ్‌పీటీసీ బొడ్డు సుధారాణి రామస్వామిలకు ఎండపల్లి మార్కండేయ ఆలయ కమిటీ, పద్మశాలి సంఘం తరఫున అధ్యక్షులు ఆడెపు మల్లేశం, ఉపాధ్యక్షుడు మంచికట్ల మల్లయ్యా, ప్రధాన కార్యదర్శి గుర్రం శంకరయ్య, సంఘ సభ్యులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం దేవాలయం పరిసరాల్లో లైటింగ్ ఏర్పాటు చేయడం విశేషమని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

Leave a Reply