Village people | సర్పంచ్‌గా తాటిపర్తి రాజవ్వ ఏకగ్రీవం
Village people | ఎండపల్లి, ఆంధ్ర ప్రభ : ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి రాజవ్వ తిరుపతి రెడ్డి ఏకగ్రీవం(unanimously)గా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో సర్పంచ్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది.
ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి తల్లి అయిన రాజవ్వను గ్రామ ప్రజలు(Village people) ఏకగ్రీవంగా గెలిపించారు. ఈ సందర్భంగా రాజవ్వ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి పని చేస్తానని తెలిపారు.

