గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోగ రామస్వామి
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ(Gandhinagar Colony)కి చెందిన నిరుపేదలైన 2 కుటుంబాలకు కమ్మర్ పల్లి(Kammarpally) గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోగ రామస్వామి తెలిపారు.
ఇటీవల కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన కొండపల్లి లక్ష్మన్(Kondapalli Laxman), చిత్తారి నర్సింలు కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, సున్నం మోహన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.