Vijayawada | 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్

Vijayawada | 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్

  • ఘనంగా నిర్వహించాలి..
  • శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు…

Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహణకు సంబంధించి ఈరోజు విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు సందర్శించి, ఏర్పాట్లు, మౌలిక వసతులు, జరుగుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. పది సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన తెలిపారు.

దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, భోజనం, వైద్య సేవలు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని అసోసియేషన్ సభ్యులకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా చాటాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాప్ విసి, ఎండి ఎస్ భరణి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గద్దె క్రాంతి, రాష్ట్ర బాడ్మింటన్ సెక్రటరీ అంకమ్మ చౌదరి, విఎంసి ఇంజనీరింగ్ సిబ్బంది, శాప్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply