మహా సమాధికి ప్రణామం దర్శించుకున్నవిజయ్ దేవరకొండ

మహా సమాధికి ప్రణామం దర్శించుకున్నవిజయ్ దేవరకొండ

  • తోడుగా సోదరుడు దేవరకొండ ఆనంద్

పుట్టపర్తి , ఆంధ్రప్రభ : పుట్టపర్తి భగవాన్ సత్యసాయి బాబా మహా సమాధిని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Tollywood hero Vijay Deverakonda) దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రశాంతి నిలయం(Prashanthi Nilayam)లోని శాంతిభవనం చేరుకుని అక్కడ విశ్రాంతి అనంతరం సాయంత్రం ఐదు గంటలకు సాయి కులం సభ(Sai Kulam Sabha) మందిరానికి చేరుకున్నారు.

అక్కడ నిర్వహించే భజన కార్యక్రమాల్లో పాల్గొని ఆరున్నర గంటలకు బాబా మహాసమాధిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భగవాన్(Bhagwan) సత్యసాయిబాబా విద్యాసంస్థలలో పదవ తరగతి వరకు పుట్టపర్తి(Puttaparthi)లోనే విద్యను అభ్యసించారు. నిన్నటి రోజు ప్రముఖ హీరోయిన్ రష్మిక(heroine Rashmika) మందనతో నిశ్చితార్థం అనంతరం భగవాన్ సత్యసాయిబాబా మహాసమాధి దర్శనార్థం కుటుంబ సమేతంగా పుట్టపర్తికి విచ్చేసి మహా సమాజం దర్శించుకుని తిరిగి సోమవారం(Monday) బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది. విజయ్ దేవరకొండ వెంట సోదరుడు ఆనంద్ దేవరకొండ ఉన్నారు.

Leave a Reply