విజయ్ ఆంటోనీ భద్రకాళి

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలుగు ప్రేక్షకులను బిచ్చగాడు సినిమాతో అలరించిన విజయ్ ఆంటోని మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘శక్తి తిరుమగణ్’ (Shakthi Thirumagan). తెలుగులో భధ్రకాళి పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి అరుణ్ ప్రభు (Arun Prabhu) దర్శకత్వం వహించారు. సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్(Bhadrakaali Trailer)ను విడుదల చేసింది.
రాజకీయ నేపథ్యంలో..
ట్రైలర్‌లో విజయ్ ఆంటోనీ చెప్పిన డైలాగులను బట్టి రాజకీయ నేపథ్యం ఉన్న కథగా తో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. అందరూ ఇలానే తప్పుకుంటే ఎలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి.. ఆకలి ఆకలి అంటే ఎవరూ పెట్టరు లాక్కోవాలి.’ అంటూ విజయ్ ఆంటోనీ చెప్పిన డైలాగ్‌లు అదరిపోయాయి. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
