వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారులు, రైతులు…

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారులు, రైతులు…
దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయం పై మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ దండేపల్లి మండలంలోని ముత్యంపేట రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయం పైన ఒక్క రోజుశిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముత్యంపేట గ్రామానికి చెందిన రైతు కొట్టే రవీందర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ.. తాను 10 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందని, ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహకం అందించాలని కోరారు. అనంతరం రైతులకు భూసార పరీక్ష కార్డులు, ప్రకృతి వ్యవసాయ కిట్లను మండల వ్యవసాయ అధికారి గొర్ల అంజిత్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, మౌనిక, నరేష్, శ్రీకన్యతోపాటు రైతులు పాల్గొన్నారు.
