న్యూఢిల్లీ : దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంట్ సభ్యుల ఓట్లతో జరిగిన ఈ ఎన్నికలో భారీ ఉత్సాహం నెలకొంది. మొత్తం 781 మంది ఎంపీలలో 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించి, భారతదేశం కొత్త ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు. ఆయన గెలుపుతో ఎన్డీఏ కూటమిలో సంబరాలు మొదలయ్యాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 781 ఓట్లలో 767 (98.4 శాతం) పోలయ్యాయి. విజేత రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి.
రాధాకృష్ణన్ గెలుపుతో ఎన్డీఏ శిబిరంలో ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది. ఈ విజయాన్ని వారు భారీ స్థాయిలో జరుపుకుంటున్నారు.

