ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి నామినేష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : జగదీప్ ధన్ఖడ్ ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అధికార ఎన్డీఏ (NDA ) కూటమి తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఇప్ప‌టికే నామినేష‌న్ ధాఖ‌లు చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (former judge Justice Sudarshan Reddy )పేరు ప్రకటించింది. ఆయ‌న ఈరోజు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)తో పాటు కూటమికి చెందిన 20 మంది ఎంపీలు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేయడం విశేషం.

తెలంగాణ వాసి..
జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district)ఆకుల మైలారం గ్రామం. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన, న్యాయవ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. 2005 నుంచి 2007 వరకు గౌహతి హైకోర్టు (High Court) ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 2007 నుంచి 2011 వరకు సుమారు నాలుగున్నరేళ్ల పాటు సేవలందించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి పదవీ విరమణ చేశాక, గోవా రాష్ట్రానికి లోకాయుక్తగా కూడా ఆయన పనిచేశారు.

Leave a Reply