వేంకటేశ్వర స్వామి దర్శనం…

వేంకటేశ్వర స్వామి దర్శనం…
రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర(MLA Gandra) మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా ఎమ్మెల్యే వెళ్తూ, భక్తులతో మాట్లాడారు.
మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఎమ్మెల్యే గుట్ట కింద ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే భక్తులనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి(Sri Buguloni Venkateswara Swamy) అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జాతరకు రూ.7 కోట్లు నిధులు కేటాయించిందని, ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
- జగ్గయ్యపేటలో ఏనుగు రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…..
కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒడ్డాల తిరుపతికి చెందిన ఏనుగు రథం వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి రథాన్ని జాతరను ప్రారంభించారు. అనoతరం గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేసి టెంకాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బుగులోని జాతర చైర్మన్ గంగుల రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
