Vemulawada | తెలంగాణ ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలి

Vemulawada | తెలంగాణ ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలి
- సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Vemulawada | వేములవాడ, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా గంగిరెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి రైతుల పండుగగా గుర్తింపు పొందిందని పేర్కొన్న ఆయన, రైతుల కష్టఫలితమే ఈ పండుగకు మూలమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని, మంచి పంటలు పండాలని ఆకాంక్షించారు.
సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని, అదే విధంగా రైతుల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని అన్నారు. ప్రజలందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గంగిరెద్దుల వారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.
