Vemsoor | జన్మదిన వేడుకలకు హాజరైన మంత్రి తుమ్మల

Vemsoor | జన్మదిన వేడుకలకు హాజరైన మంత్రి తుమ్మల

Vemsoor | వేంసూరు, ఆంధ్రప్రభ : రాజ్యసభ సభ్యులు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి 96వ జన్మదిన వేడుకలకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు బండి గురునాథరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసర చంద్రశేఖరరెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గొర్ల వెంకటప్పా రెడ్డి, మాజీ చెరుకు అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పుచ్చకాయల శంకరరెడ్డి, జోనల్ కమిటీ అధ్యక్షులు మందపాటి మహేశ్వరరెడ్డి, కందుకూరు గ్రామ సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ గొర్ల ప్రభాకర రెడ్డి, బండి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైజుద్దీన్, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, కూరపాటి శ్రీనివాసరావు తోపాటు మండలం లోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కందుకూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply