
Velpur | గ్రామానికి సేవకుడిగా ఉంటా..!
Velpur | గ్రామానికి సేవకుడిగా ఉంటా..!
- సర్పంచుగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్
- గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సేవకుడిగా పని చేస్తా
Velpur | వేల్పూర్, ఆంధ్రప్రభ : గ్రామానికి సేవకుడిగా ఉండి.. అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేసి గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతానని, గ్రామం ప్రగతియే నా లక్ష్యమని జిన్నా జనార్దన్ అన్నాడు. వేల్పూరు మండలంలో ఆక్లూర్ గ్రామంలో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం జిన్నా జనార్దన్ మాట్లాడుతూ… ప్రజలు తనపై నమ్మకం ఉంచి తనను గెలిపించిన వారికి రుణపడి ఉంటానని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేపడుతానని పాలకవర్గ సభ్యులు అందరం కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని సమస్యలు వివరించడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తానని గ్రామాభివృద్ధే లక్ష్యంగా సేవకుడిగా పనిచేస్తానన్నాడు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వార్డు సభ్యులు అధికారులు పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
