Velpur | సన్మానం..

Velpur | వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని లక్కోరలో శ్రీ మహాలక్ష్మీ అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ దాసరి ఆవర్ల, ఉప సర్పంచ్ ఆత్మారాం, కార్యదర్శి విజయ్ కుమార్ పాటు వార్డుసభ్యులను సన్మానించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేసేందుకు తనవంతు కృషి చేస్తానని సర్పంచ్ అవర్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో వేల్పూర్ సొసైటీ వైస్ చైర్మన్ బైర్ శ్రీధర్, ట్రస్టు సభ్యులు చిన్న హన్మాండ్లు, దాసరి రాజు, చేపూర్ గంగాధర్, అనిల్, ఆర్మూర్ మోహన్, తదితరులున్నారు.

Leave a Reply