Veldanda | భీమ లింగం స్వామి సారథ్యంలో గోమాత పూజలు

Veldanda | భీమ లింగం స్వామి సారథ్యంలో గోమాత పూజలు
Veldanda | వెల్దండ, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ నాగర్ కర్నూల్ జిల్లా మనగుడి వారి ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి, కనుమ పండగ సందర్భంగా రాచుర్ గ్రామంలోని శివాలయ దేవాలయం వద్ద భీమ లింగం స్వామి వారి సారథ్యంలో గోమాత పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ..
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో సిరి సంపదలు, ఆనందం, ఐశ్వర్యంతో తులతూగాలని అన్నారు. సాంస్కృతి మన సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాల కిష్టయ్య గౌడ్, వడ్ల వెంకటయ్య, బాలకృష్ణయ్య, బంగారు జంగయ్య, రవీందర్ రెడ్డి, వెంకటయ్య గౌడ్, పడకంటి వెంకటేష్, కొంగల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
