Veeramallu 2 | గుట్టు బయటపెట్టిన నిధి..

Veeramallu 2 | గుట్టు బయటపెట్టిన నిధి..
Veeramallu 2 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బాహుబలి సినిమా ఎంతటి సంచలనం(What a sensation) సృష్టించిందో తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే.. విదేశాల్లో సైతం విశేషంగా ఆకట్టుకుని రికార్డ్ కలెక్షన్స్(Record Collections) సాధించింది. ఇక అక్కడ నుంచి సీక్వెల్ అనేది ఓ ట్రెండ్ గా మారిన విషయం తెలిసిందే. ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి.. వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు ఈ ఇయర్ లో రిలీజైంది. దీనికి సీక్వెల్ ఉందని ప్రకటించారు. అయితే.. ఉందా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు నిధి అగర్వాల్(Nidhi Agarwal) వీరమల్లు 2 అసలు గుట్టు బయటపెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. నిధి ఏం చెప్పింది..? తెర వెనుక ఏం జరుగుతోంది…?
Veeramallu 2 | అందాల నిధి..

నిధి అగర్వాల్.. సవ్యసాచి సినిమాతో(Savyasachi movie) టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాల్లో నటించింది. సవ్యసాచి రిలీజ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జంటగా వీరమల్లు సినిమా(Veeramallu movie)లో లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. అయితే.. వీరమల్లు బాగా ఆలస్యం అవ్వడం వలన ఆ సినిమా అంతగా ఆమెకు ఉపయోగపడలేదని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు నిధి అగర్వాల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జంటగా నటించింది. మారుతి తెరకెక్కించిన రాజాసాబ్ మూవీ(Rajasaab Movie) జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా పై నిధి చాలా ఆశలు పెట్టుకుంది.
Veeramallu 2 | మొదలైనప్పుడు చూద్దాం..

రాజాసాబ్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ(People Media Factory) అత్యంత ప్రతిష్టాత్మంకగా నిర్మించింది. ఈ సినిమాను జనవరి 9న భారీ స్థాయలో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నిధి అగర్వాల్ కు వీరమల్లు 2 గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి నిధి సరైన సమాధానం(Correct answer) చెప్పడం లేదు. వీరమల్లు గురించి ఇప్పుడే మాట్లాడలేను.. అది మొదలైనప్పుడు చూద్దాం అంటూ సమాధానం చెబుతుంది. దీనిని బట్టి.. ఆ సినిమా మొదలవుతుందని తనకే నమ్మకం లేదు అనే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా బయటపెట్టింది.
Veeramallu 2 | టర్నింగ్ పాయింట్..

నిజానికి నిధి అగర్వాల్ వీరమల్లు పార్ట్ 1 లో చాలా తక్కువ సేపే కనిపించింది. సెకండ్ పార్ట్(Second part) లో చూపిద్దామని దాచేశారని సమాచారం. వీరమల్లు 2 లో నిధి అగర్వాల్ ఎక్కువ సేపు కనిపిస్తుందిలే అనుకుంటే.. ఇప్పుడు వీరమల్లు పార్ట్ 2 లేకుండా పోయిందని టాక్. ఇదిలా ఉంటే.. నిధి అగర్వాల్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్(Latest movie Rajasaab) కు కూడా పార్ట్ 2 ఉందని చెబుతున్నారు. అయితే.. నిజంగా ఉంటుందా అంటే.. ఈ సినిమా రిజెల్ట్ పై ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. పైగా ప్రభాస్ సినిమా అంటే.. సీక్వెల్ కన్ ఫర్మ్ అనేట్టుగా తయారైంది పరిస్థితి. ఈ లెక్కన.. రాజాసాబ్ సీక్వెల్ కన్ ఫర్మ్ అనుకోవచ్చు. మరి.. ఈ సినిమా అయినా నిధి అగర్వాల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్(Turning point) అవుతుందేమో చూడాలి.

CLICK HERE TO READ డిసప్పాయింట్ చేస్తే మా ఇంటికి రండి.. అడ్రస్ ఇస్తా!
