VBG Ram Ji | వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి

VBG Ram Ji | వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి

VBG Ram Ji | ఉట్నూర్, ఆంధ్రప్రభ : వీబీజీ రామ్ జి చట్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెఢమ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోనిబీర్సాయిపేట, దంతన్ పెల్లి గ్రామపంచాయతీలలో విస్తృత0గా కరపత్రాలు పంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, ఉట్నూర్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ సర్పంచ్ ల సంఘం ఉట్నూర్ మండల నూతన అధ్యక్షులు అత్రం తిరుపతిమాట్లాడుతూ…కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మరో కొత్త చట్టంవీబి జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఉపాధి కూలీల హక్కులను పూర్తిగా కాలరాస్తుందని అని వారు విమర్శించారు.

విబిజీ రాంజీ పథకంతో కూలీలకు రానున్నరోజుల్లో పని చేసే అవకాశం తగ్గుతుందని, తక్కువ వేతనాలు చెల్లించే అవకాశం ఉంటుందని, ఉపాధి పనులను కాంట్రాంటర్ లకు ఇచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలకు ఉపది కోల్పోయే అవకాశం ఉందని, నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది అని , కూలి వేతనాల్లో దోపిడీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని, మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయి అని, దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు అని.. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి గా భాద్యతలు తీసుకున్న వెంటనే దాని స్థానంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యదావిధంగా కొనసాగిస్తారని వారు ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో బర్సాయిపేట్ సర్పంచ్ సిపెల్లి సరిత రాజేష్, దంతంపెల్లి ఉప సర్పంచ్ మొహ్మద్ ముబిన్, బీరాయిపేట్ ఉప సర్పంచ్ ణాల ఆంజనేయులు, దంతన్ పెల్లి గ్రామ అధ్యక్షులు షేరీప్, నాయకులు భీమన్న, మతీన్, రాపెళ్ళిభాస్కర్, దాసరిసత్యం, శిరాజ్ ఖాన్, జాకు, రాజన్న ప్రజలు, కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply