భద్రాచలం, ఏప్రిల్ 11 (ఆంధ్రప్రభ): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం స్వామి వారికి వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం హావనం గావించి, సూర్యప్రభ వాహనంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ రాజ వీధిలో ఊరేగింపు నిర్వహించారు.
ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం చక్ర తీర్థం, సాయంత్రం 6 గంటలకు పూర్ణహుతి తర్వాత స్వామి వారికి శేషవాహన సేవ జరుగుతుంది. అనంతరం ద్వాజావరోహణం, దేవాతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షణలు, ద్వాదసారాధనలు, శ్రీ పుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు పరి సమాప్తి అవుతాయి.
