Vasanta Panchami | ఘనంగా వసంత పంచమి వేడుకలు

Vasanta Panchami | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో దాహేగాం, దౌలతాబాద్ గ్రామాలతో పాటు ముధోల్ లోని రెండు శిశు మందిర్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచరణలతో మధ్య గాయత్రి హోమంను నిర్వహించారు. సరస్వతి దేవికి పంచామృతాభిషేకం, విశేషమైన పూజలు నిర్వహించారు.

పలువురు వక్తలు మాట్లాడుతూ… వసుధైక కుటుంబం భావన కల్పించడమే శిశుమందిర్ లక్ష్యమని పేర్కొన్నారు. వసుధైక కుటుంబం అంటే “ప్రపంచమంతా ఒకే కుటుంబం” మని అన్నారు.విద్యార్థులకు చక్కటి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల సర్వాంగిణ వికాసానికి కృషి చేస్తూ దేశ భక్తి, దైవ భక్తి, మాతృ భక్తి, పితృ భక్తి, గురు భక్తులను పెంపొదిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడం.

అంతే కాక మన భారతీయ సంస్కృతిని పరిరక్షిస్తూ సమాజంలోని ప్రజల మధ్య ఉన్న అంతరాలను తొలగించి “వసుదైక కుటుంబం” అనే భావనను కల్పిస్తూ మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ధర్మపురి సుదర్శన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సారథి రాజు, వక్తలు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

