Varla Kumar Raja | అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Varla Kumar Raja | పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం మంటాడ శివారు రెడ్డిపాలెంలో రామాలయం దగ్గర గ్రామస్తుల స్వచ్ఛంద విరాళాలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు ఐక్యంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. వారితోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

