Vamsi Krishna | రామగుండం-మణుగూరు రైల్వే లైన్ డీపీఆర్ పూర్తి

Vamsi Krishna | రామగుండం-మణుగూరు రైల్వే లైన్ డీపీఆర్ పూర్తి

  • మారుపేర్ల సమస్యపై సీఎంతో మాట్లాడతా…
  • రామగుండం కార్పొరేషన్ను అప్ గ్రేడ్ చేయాలి…
  • పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ …

Vamsi Krishna | గోదావరిఖని, ఆంధ్రప్రభ : దశాబ్దాలుగా డిమాండ్‌లో ఉన్న రామగుండం మణుగూరు రైల్వే లైన్ డీపీఆర్ పూర్తయిందని పెద్దపెల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రైల్వే లైన్ పనులకు సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరైనట్లు గుర్తు చేశారు. సాధ్యమైనంత తొందరలో పనులు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ రోజు సాయంత్రం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ… సింగరేణి బొగ్గు పరిశ్రమలో దశాబ్దాల పాటు కార్మికుల వారి సమస్యల పరిష్కారం పై తనవంతు బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడుతానని చెప్పారు. మారుపేర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రామగుండం లో 2400 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ రాబోతుందని, త్వరలోనే వాటికి సంబంధించిన పనులు మొదలవుతాయని పేర్కొన్నారు. అంతర్గంలో ఏర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సర్వే జరుగుతుందన్నారు.

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ఎంపీ మండిపడ్డారు. వందరోజుల పని విధానానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పెద్దపెల్లి జిల్లాలోని కొందన పెళ్లి కన్నాల గ్రామాలకు సంబంధించి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అతి త్వరలో మరో ప్రారంభం అవుతాయని ఎంపీ వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీల కోసం మాత్రమే పనిచేస్తుందని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా అంతర్గమ్మ మండలంలోని లింగాపూర్ ప్రాంతంలో లేదర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ వంశీకృష్ణ వివరించారు. విలేకరుల సమావేశంలో మినిమం వేజ్ బోర్డ్ మాజీ చైర్మన్ బాబర్ సలీం పాషా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కుమార్ స్వామి, పిల్లి మల్లికార్జున్, విజయ్ , కోటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply