AP | వైఎస్ జ‌గ‌న్ తో వ‌ల్ల‌భ‌నేని వంశీ భేటీ

వెల‌గ‌పూడి : వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) నిన్న‌ మధ్యాహ్నం.. విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన మొత్తం 11కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఈ విడుదల సాధ్యమైంది. వంశీని ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో విజయవాడ పటమట పోలీసులచే అరెస్టు చేయబడ్డారు. ఆయనపై కిడ్నాప్, బెదిరింపులు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, నకిలీ ఇళ్ల పట్టాలు, అక్రమ గనుల తవ్వకాలు వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా ఆరోపణలున్నాయి.

ఫిబ్రవరి 16 నుంచి సుమారు 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీ (Remand prisoner)గా ఉన్నారు. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు (Grant of bail) కావడంతో నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన ఈ రోజు నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తాడెపల్లిగూడెంలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసానికి (YS Jagan’s residence) వెళ్లి ఆయనను కలిశారు.

వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయపోరాటం చేద్దామని..ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్‌ జగన్‌కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply